siri-1

VERY IMPORTENT WEB BLOG మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No. 7731959303

email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions through email monday200300@gmail.com

SIRI-3-set- dont disturb

ADDRESS: Home Business Ideas -Telugu Monthly Magazine and Small Industry Resech Institute (SIRI)

KHAMMAM,TELANGANA-India-507002,......Cell: 8501818559 email: sunday200300@gmail.com

Ac.NO.. 310 731 588 69 . State Bank of India(SBI).KHAMMAM, Name....P.RAMARAO...
{ CLICK below FOR SIRI BOOKS / PROJECT REPORTS } సిరి బుక్స్ / ప్రాజెక్ట్ రిపోర్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

www.bookscompany.blogspot.com


free reg.


రిజిస్ట్రేషన్ ఉచితం....... Registration FREE............

Surya Small Industry Training Institute [ SITI ]

మీరు [ SITI ] తో ఉచితముగా సబ్యులుగా కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే
రిజిస్ట్రేషన్ చేయించుకోండి . ఈ సెల్ 77319-59303 నెంబర్ కు మెసేజ్ పంపండి . లేదా
sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .


మీ పేరు /వయస్సు /అడ్రస్ / సెల్ నెం /ఈమెయిల్/విద్యార్హతలు /ప్రస్తుత వృత్తి/అనుభవం /etc

రిజిస్ట్రేషన్ ఉచితం . రిజిస్టర్డ్ మెంబర్స్ ఆదాయం పొందటం తో ఇతర బెనిఫిట్స్ కు అర్హత పొందుతారు . Registered Members will be benefited


Followers

Wednesday, November 24, 2010

48-మామిడి, అరటి, బొప్పాయి


పెద్దసంఖ్యలో మామిడి, అరటి, బొప్పాయిపళ్ళను శాస్త్రీయంగా పండించడం

సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పళ్ళను పూర్తిగా పండకుండానే చెట్లనుండి కోసి, తర్వాత వాటిని మగ్గ  బెడతారు . సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. పండు బరువు తగ్గిపోతుంది, ఎండిపోతుంది మరియు పండటం కూడా సమంగా ఉండదు. ‘తైవాన్ రెడ్ లేడీ’ వంటి కొన్ని వాణిజ్యరకాల బొప్పాయిపళ్ళలో అంచుల్లోనేమో బాగా గట్టిగా ఉండి మధ్యలోనేమో మెత్తబడుతుంది.


సాధారణంగా పళ్ళను మగ్గ బెట్టడానికి ఎథ్రెల్ స్ప్రే చేయడంగానీ, వాటిని ఎథ్రెల్ ద్రవంలో ముంచడంగానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్ లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలొస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా, పళ్ళను మగ్గబెట్టే గోదాములలో ఇథలీన్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది...రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పళ్ళను మగ్గించడానికి ప్లాస్టిక్ టెంట్లలో ఇథలీన్ గ్యాస్ ను వదిలి పళ్ళను పండబెట్టడం రూపోందించారు.


   
సాధారణ గది ఉష్ణోగ్రతలో మూడురోజులు ఉంచిన తర్వాత బొప్పాయి పండు


గది ఉష్ణోగ్రతలో ఇథలీన్ గ్యాస్(100పీపీఎమ్) వదులుతూ
మూడురోజులు ఉంచిన తర్వాత బొప్పాయి పండు

ఈ విధానంలో ఇథలీన్ గ్యాస్ వదలడానికి ఎథ్రెల్ కు స్వల్ప పరిమాణంలో ఆల్కలీని కలుపుతారు. గాలి చొరబడటానికి వీలులేని... మోసుకెళ్ళగలిగే... ప్లాస్టిక్ టెంట్లలో ఈ గ్యాస్ వదులుతారు. పళ్ళను చిల్లులున్న ప్లాస్టిక్ క్రేట్లలో ఉంచి ఆ టెంట్లలో ఉంచుతారు. టెంట్ లోపల ఒక డబ్బాలో తగినంత పరిమాణంలో ఎథ్రెల్ ఉంచి...ఇథలీన్ గ్యాస్ వదలాలనుకున్నప్పుడల్లా కొద్దికొద్దిగా ఆల్కలీ(సోడియమ్ హైడ్రాక్సైడ్)ను ఎథ్రెల్ కు కలుపుతూ...వెంటనే టెంట్ లోకి గాలి వెళ్ళకుండా సీల్ చేసేస్తూ ఉంటారు. 

విడుదలయ్యే ఇథలీన్ గ్యాస్ టెంట్లో అన్నివైపులా వెళ్ళడంకోసం...లోపల బ్యాటరీతో నడిచే ఒక ఫ్యాన్ ఉంచుతారు. 18-24గంటలు అలా గ్యాస్ తగిలేలా ఉంచిన తర్వాత పళ్ళను బయటకు తీసి సాధారణ గది ఉష్ణోగ్రతలో పెడతారు. అప్పుడు పళ్ళు పూర్తిగా పండుతాయి.

సాధారణంగా మామిడికాయలను మగ్గబెట్టాలంటే పదిరోజులు పడుతుంది. అయితే 100పీపీఎమ్ ఇథలీన్ గ్యాస్ 24గంటలపాటు తగిలేలా చేస్తే అదే కాయలు ఐదురోజుల్లోనే పండుతాయి. పైగా నాణ్యత కూడా చెడిపోదు. అదేవిధంగా అరటి పళ్ళ హస్తాలను 100పీపీఎమ్ ఇథలీన్ గ్యాస్ తగిలేలా 18గంటలు ఉంచితే నాలుగురోజుల్లో పండుతాయి .20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితే అవి పండటానికి ఆరు రోజులు పడుతుంది.
బొప్పాయి పళ్ళను ఇథలీన్ గ్యాస్ తగిలేలా చేస్తే రంగు, గట్టిదనం ఒకేరకంగా ఉండి నాలుగురోజుల్లో పండిపోతున్నాయి.


No comments: